Afroj Vadariya: దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు అఫ్రోజ్ వడారియా అరెస్ట్

  • ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు
  • హవాలా లావాదేవీలన్నింటినీ అఫ్రోజే చూసుకుంటాడు
  • ఫాహింతో కూడా అఫ్రోజ్ నేరుగా సంప్రదింపులు

అఫ్రోజ్ వడారియా అలియాస్‌ అహ్మద్‌ రాజాను ముంబై ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు. దావూద్‌కి సంబంధించిన హవాలా లావాదేవీలన్నింటినీ అఫ్రోజే చూసుకునేవాడని పోలీసులు తెలిపారు. దావూద్ కు అత్యంత సన్నిహితుడైన ఫాహింతో కూడా అఫ్రోజ్ నేరుగా సంప్రదింపులు జరుపుతాడని పేర్కొన్నారు. అఫ్రోజ్‌పై ఉన్న లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Afroj Vadariya
Ahmad Raja
Davood Ibrahim
Chota Shakil
Fahim
Mumbai
  • Loading...

More Telugu News