Vivek: ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్‌కు మాతృ వియోగం

  • అనారోగ్యంతో కన్నుమూసిన వివేక్ తల్లి 
  • కొన్నేళ్ల క్రితం కుమారుడిని కోల్పోయిన వివేక్
  • తల్లి మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన వివేక్

‘శివాజీ, అపరిచితుడు, రోబో, రాజా రాణి’ వంటి పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ ప్రముఖ హాస్యనటుడు వివేక్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి నేడు అనారోగ్యం కారణంగా చెన్నైలో తుది శ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొన్నేళ్ల క్రితం వివేక్ తన కుమారుడు ప్రసన్న కుమార్(13)ను కోల్పోయారు. ప్రస్తుతం తన తల్లిని కూడా కోల్పోవడంతో వివేక్ విషాదంలో మునిగిపోయారు. వివేక్ హాస్య నటుడిగా రజనీకాంత్, విజయ్, అజిత్, విశాల్ సహా పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో కమెడియన్‌గా అలరించారు.

Vivek
Shivaji
Raja Rani
Robo
Aparichitudu
Rajanikanth
Vijay
Ajith
  • Loading...

More Telugu News