Uttar Pradesh: యూపీలో దారుణం.. తొమ్మిది మందిని బలిగొన్న భూవివాదం

  • వివాదాస్పద భూమి కోసం ఘర్షణ
  • దాడిలో పాల్గొన్న రెండు వర్గాలు
  • 20 మందికి తీవ్ర గాయాలు

భూ వివాదం తొమ్మిది మంది ప్రాణాలు బలిగొనగా, 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా మురాటియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ అంకిత్ కుమార్ అగర్వాల్ తెలిపిన కథనం ప్రకారం, నేటి ఉదయం వివాదాస్పద భూమి కోసం జరిగిన వివాదంలో ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలకు చెందిన దాదాపు 100 మంది ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో 9 మంది దుర్మరణం చెందగా, 20 మంది తీవ్ర గాయాలపాలైనట్టు తెలుస్తోంది. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు స్త్రీలు ఉన్నారు.

Uttar Pradesh
Sonbhadra
Muratia
Ankith Kumar Agarwal
Firing
  • Loading...

More Telugu News