Ramanaidu: నిరుద్యోగ భృతిని రద్దు చేసి 6 లక్షల మందికి అన్యాయం చేశారు: జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు విమర్శలు

  • కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ పనితీరు
  • టెండర్ల రద్దు కారణంగా రాష్ట్రానికి అన్యాయం
  • వైఎస్ హయాంలో మట్టి పనులే జరిగాయి
  • ప్రాజెక్టులను నిలిపేసి రైతులకు నష్టం కలిగించొద్దు

నిరుద్యోగ భృతి‌ని రద్దు చేయడం ద్వారా 6 లక్షల మందికి అన్యాయం చేశారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. వైసీపీ పనితీరు కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. టెండర్ల రద్దు కారణంగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మట్టి పనులు మాత్రమే జరిగాయని, కాంక్రీట్ పనులన్నీ చంద్రబాబు హయాంలో జరిగినవేనని రామానాయుడు స్పష్టం చేశారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను నిలిపివేసి రైతులకు నష్టం కలుగజేయొద్దని కోరారు.

Ramanaidu
KCR
Jagan
Rajasekhar Reddy
Chandrababu
Polavaram
  • Loading...

More Telugu News