Nagarjuna Reddy: రెండు వర్గాలుగా చీలి పరస్పరం దాడులు చేసుకున్న వైసీపీ కార్యకర్తలు

  • నాగార్జునరెడ్డి స్థల వివాదంలో తలెత్తిన గొడవ
  • నాగార్జునరెడ్డిపై బెదిరింపులకు పాల్పడిన వైసీపీ నేత
  • పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు

స్థల వివాదంలో మొదలైన గొడవ అధికార పార్టీ రెండు వర్గాలుగా చీలి కొట్టుకునే వరకూ వెళ్లింది. తనకున్న స్థలంలో రాయలసీమ ఉద్యమనేత ఒకరు ఇల్లు కట్టుకోబోతే వైసీపీ నేత అడ్డుకున్నారు. దీంతో ఉద్యమనేతకు అండగా కొందరు వైసీపీ కార్యకర్తలు నిలవడంతో.. రెండు వర్గాలుగా చీలి దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది.

రాయలసీమ ఉద్యమనేత నాగార్జున రెడ్డి తన స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు సిద్ధమవగా, వైసీపీ నేత జగదీశ్వరరెడ్డి అడ్డుకోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో వైసీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలి కొందరు నాగార్జునరెడ్డికి అండగా నిలవడంతో చివరకు ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ఈ గొడవను స్థానికులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బాగా వైరల్ అయింది.

Nagarjuna Reddy
Jagadeeswar Reddy
Anantapur District
Thadipatri
Social Media
  • Loading...

More Telugu News