Andhra Pradesh: పలు దేశాలు తిరిగిన చంద్రబాబు చివరకు రాజమౌళికి అప్పగించారు!: మంత్రి బుగ్గన విమర్శలు

  • అమరావతి  కోసం రూ.1700 కోట్లు ఖర్చు చేశారు
  • అందులో సగానికి పైగా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది
  • రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.277 కోట్లే కేటాయించింది

రాజధాని అమరావతి నిర్మాణం డిజైన్ విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నాడు పలు దేశాలు పర్యటించి వచ్చి, చివరికి దానిని సినీ దర్శకుడు రాజమౌళికి అప్పగించారని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేడు శాసన సభలో విమర్శించారు. అమరావతి నిర్మాణం కోసం గత ఐదేళ్లలో రూ.1700 కోట్లు ఖర్చు చేశారని, అందులో సగానికి పైగా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.277 కోట్లు మాత్రమే కేటాయించిందని వివరించారు. అమరావతి నిర్మాణం కోసం తమ ప్రభుత్వం తొలి బడ్జెట్ లోనే రూ.500 కోట్లు కేటాయించిందని చెప్పారు.

Andhra Pradesh
Chandrababu
buggana
  • Loading...

More Telugu News