Jupalli Krishna Rao: టీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నారనే వార్తలపై జూపల్లి స్పందన!

  • గిట్టని వాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు
  • రాజకీయాల్లో ఉన్నంత కాలం టీఆర్ఎస్ లోనే ఉంటా
  • కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యం

టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన స్పందించారు. తాను పార్టీ మారుతున్నాననే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. గిట్టని వాళ్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో కొనసాగినంత కాలం తాను టీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తానని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పారు.

Jupalli Krishna Rao
TRS
KCR
  • Loading...

More Telugu News