Andhra Pradesh: కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న: ‘జనసేన’ ఎమ్మెల్యే రాపాక

  • జగన్ అధికారంలోకి రావాలని రైతులు ఆశించారు
  • బడ్జెట్ లో రైతులకు పెద్దపీట వేశారు
  • ఈ బడ్జెట్ యాభై రోజుల్లో తయారు చేసింది కాదు

ఏపీ సీఎం జగన్ పై జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో రైతులకు పెద్దపీట వేశారని కొనియాడారు. బాధిత రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు ఆశించారని, అలాంటి బడ్జెట్ నే జగన్ రూపొందించారని ప్రశంసించారు. ఈ బడ్జెట్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఇది యాభై రోజుల్లో తయారు చేసిన బడ్జెట్ కాదని జగన్ తన పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను చూసి ఈ బడ్జెట్ ను రూపొందించారని అన్నారు.

Andhra Pradesh
assembly
jagan
cm
Rapaka
  • Loading...

More Telugu News