Jagan: ఆ మాట అనలేదని బైబిల్ పై ప్రమాణం చేసి చెప్పగలరా?: జగన్ కు మంద కృష్ణ సూటి ప్రశ్న

  • ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పారు
  • ఇప్పుడు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు
  • మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో జగన్ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్టు జగన్ చెప్పారని అన్నారు. వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడలేదనే విషయాన్ని బైబిల్ పై ప్రమాణం చేసి చెప్పగలరా? అని ప్రశ్నించారు. మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా? అని ఎద్దేవా చేశారు. దివంగత వైయస్ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారంటూ విమర్శించారు. వైసీపీ గెలుపు కోసం మాదిగలు కృషి చేసింది నిజం కాదా? అని అడిగారు. ఎస్సీ వర్గీకరణపై 24 గంటల్లో జగన్ తన వైఖరిని ప్రకటించాలని... లేకపోతే, 48 గంటల్లో వైసీపీ ప్రభుత్వంపై తమ వైఖరిని ప్రకటిస్తామని అన్నారు.   

Jagan
Manda Krishna
YSRCP
MRPS
  • Loading...

More Telugu News