kalyan Ram: ఫాంటసీ మూవీ చేసే ఆలోచనలో కల్యాణ్ రామ్

  • '118'తో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్ 
  • షూటింగు దశలో 'ఎంతమంచివాడవురా'
  • కొత్త దర్శకుడితో కల్యాణ్ రామ్ చర్చలు  

చాలా కాలంగా కల్యాణ్ రామ్ ఎదురుచూస్తోన్న సక్సెస్ ఆయనకి '118' సినిమాతో లభించింది. దాంతో ఆయన కథాకథనాలపై మరింత శ్రద్ధ పెట్టి 'ఎంతమంచివాడవురా' చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే ఆయన మరో ప్రాజెక్టుపై దృష్టి పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవల ఒక కొత్త దర్శకుడు కల్యాణ్ రామ్ కి ఒక కథ చెప్పాడట. అటు దేవలోకాన్ని .. ఇటు భూలోకాన్ని కనెక్ట్ చేస్తూ సాగే కథ ఇదని అంటున్నారు. ఈ ఫాంటసీ కథ కల్యాణ్ రామ్ కి బాగా నచ్చేసిందట. దాంతో 'ఎంతమంచివాడవురా' సినిమా తరువాత ఈ ప్రాజెక్టునే చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు. అయితే బడ్జెట్ భారీగా అవసరమవుతుండటంతో, ఎక్కడెక్కడ తగ్గించే అవకాశాలు ఉన్నాయా అనే విషయంపై కసరత్తులు చేస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

kalyan Ram
  • Loading...

More Telugu News