Andhra Pradesh: పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగానే 25 జిల్లాలు ఏర్పాటుచేస్తాం!: ఏపీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

  • అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చర్చ
  • ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సభ్యుల సూచన
  • ఈ విషయం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందన్న మంత్రి

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. తాజాగా ఈ విషయమై ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సభ్యులు ఇచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో సభ్యులు స్పందిస్తూ.. జిల్లాల ఏర్పాటుకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఇందుకోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పరిపాలన సౌలభ్యం ఉండేలా జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు.

Andhra Pradesh
YSRCP
parliament
pilli subhash chandrabos
minister
25 districts
assembly session
  • Loading...

More Telugu News