Vishnu Kumar Raju: జన్మభూమి కమిటీలకు, వీటికి తేడా ఏముంది?: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • జన్మభూమి కమిటీల్లాగానే గ్రామ వాలంటీర్ల నియామకం ఉంది
  • రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి ఉంది
  • నిర్మాణరంగం కుదేలయ్యే పరిస్థితి నెలకొంది

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గ్రామ వాలంటీర్ల నియామకాన్ని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తప్పుబట్టారు. టీడీపీ జన్మభూమి కమిటీల్లాగానే వాలంటీర్ల నియామకం కూడా ఉందని విమర్శించారు. టీడీపీ అవినీతి పార్టీగా మారడంతోనే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఇసుక కూడా దొరకని పరిస్థితి నెలకొందని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కూడా లేకుండా పోయిందని చెప్పారు. నిర్మాణరంగం కుదేలయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని తెలిపారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

Vishnu Kumar Raju
BJP
YSRCP
Village Volunteers
  • Loading...

More Telugu News