Andhra Pradesh: టీడీపీ కంటే వైసీపీ డేంజర్ అని చెప్పిన కన్నా.. తిప్పికొట్టిన వైసీపీ నేత రోజా!

  • కన్నాపై టీడీపీ నేతలు దాడులు చేశారు
  • తిరుపతిలో అమిత్ షాకూ అదే అనుభవం ఎదురైంది
  • అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద రోజా వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ ప్రమాదకరంగా తయారయిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించడంపై వైసీపీ నేత రోజా తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ నేతలు తనపై ఎన్నిదాడులు చేశారో కన్నా లక్ష్మీనారాయణ ఓసారి గుర్తుచేసుకోవాలని రోజా హితవు పలికారు.

అలాగే బీజేపీ చీఫ్ అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు జరిగిన ఘటనలను కూడా ఓసారి గుర్తుచేసుకుంటే మంచిదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. ‘ఇప్పటికే చాలామంది టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. భవిష్యత్తులో టీడీపీ నేతలంతా బీజేపీలోకి చేరుతారన్న నమ్మకంతో కన్నా మాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
roja
kanna lakshmi narayana
BJP
  • Error fetching data: Network response was not ok

More Telugu News