Andhra Pradesh: కేశినేనీ.. సొల్లు కబుర్లు వద్దప్పా.. ఆ కూడులేని కార్మికులకు జీతాలు ఇవ్వు!: వైసీపీ నేత పొట్లూరి

  • కేశినేని నాని-బుద్ధా వెంకన్న ట్విట్టర్ వార్
  •  మధ్యలో వచ్చిన వైసీపీ నేత పొట్లూరి
  • కేశినేని కార్మికులకు బాకీ జీతాలు ఇవ్వాలని సూచన

టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, కేశినేని నానిల మధ్య జరుగుతున్న ట్విట్టర్ యుద్ధంలో వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) కూడా చేరారు. తాను నంబర్ ప్లేట్లు మార్చి ట్రావెల్స్ వ్యాపారం చేసినా, అప్పులు తిరిగి చెల్లించకపోయినా 88 సంవత్సరాలుగా ఉన్న కేశినేని ట్రావెల్స్ మూసుకునే పరిస్థితి ఉండేది కాదని కేశినేని నాని తెలిపారు. బుద్ధా వెంకన్న చేసిన విమర్శలకు నాని ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ నేత పీవీపీ వెటకారంగా స్పందించారు.

ఆ రోజుల్లో స్వాతంత్ర్య సమరయోధులు ఆస్తులు అమ్మి ప్రజాసేవ చేశారనీ, పోరాటాల్లో పాల్గొన్నారని పీవీపీ తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో పీవీపీ స్పందిస్తూ.. ‘ఆ రోజుల్లో ఆస్తులు అమ్మి స్వాతంత్ర్య సమరయోధులు పోరాటాలు చేసి ప్రజాసేవ చేశారు. ఆస్తులు అమ్మాను అని సొల్లు కబుర్లు వద్దప్ప !! ఊరంతా కోడై కూస్తుంది, మీ ప్ర"బుద్ధుడి"తో సహా !! కాస్త కూడు లేని కార్మికులకు వాళ్లకు కట్టవలసిన జీతాలు కట్టవయ్యా మగడా!!’ అని ట్వీట్ చేశారు. కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండానే వ్యాపారాన్ని మూసేసిందని విమర్శించారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
Kesineni Nani
budha venkanna
Budda VENKANNA
Twitter
PVP
  • Loading...

More Telugu News