Narasimhan: తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను ఏ క్షణంలోనైనా మార్చే అవకాశం?

  • ఏపీకి ప్రత్యేక గవర్నర్ ను నియమించిన కేంద్రం
  • నరసింహన్ పదవీకాలం ముగిసినట్టే అంటూ జోరుగా చర్చ
  • తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించనున్నట్టు సమాచారం

ఇరు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ అధికారాలకు కేంద్ర ప్రభుత్వం కోత పెట్టిన సంగతి తెలిసిందే. ఆయనను తెలంగాణకే పరిమితం చేసింది. ఏపీ గవర్నర్ గా ఒడిశాకు చెందిన మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్ ను నియమించింది. తాజాగా తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను ఏ క్షణంలోనైనా మార్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. నరసింహన్ పదవీకాలం ముగిసినట్టే అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయన స్థానంలో బీజేపీకి చెందిన వ్యక్తి గవర్నర్ గా రాబోతున్నారని తెలుస్తోంది.

Narasimhan
Andhra Pradesh
Telangana
Governor
  • Loading...

More Telugu News