Sachin Tendulkar: ప్రపంచకప్ విజేతను తేల్చేందుకు అలా చేసి ఉంటే బాగుండేది: సచిన్

  • రెండో సూపర్ ఓవర్ వేయించి ఉండాల్సింది
  • అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది
  • అన్ని టోర్నమెంట్లలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలి

టైగా ముగిసిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫలితాన్ని తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫలితాన్ని తేల్చేందుకు బౌండరీ నిబంధనను ఎంచుకున్న ఐసీసీపై మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు.

తాజాగా, ఈ వివాదంపై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పెదవి విప్పాడు. సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసినప్పుడు మరో సూపర్ ఓవర్ నిర్వహించి ఉంటే సమస్య పరిష్కారమయ్యేదని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. బౌండరీ నిబంధన కంటే ఇది మిన్నగా ఉండేదని అన్నాడు. అయితే, ఇది ఒక్క ప్రపంచకప్‌కు మాత్రమే పరిమితం కాదని, అన్ని టోర్నమెంట్లలోనూ ఇదే పద్ధతిని అమలు చేయాలని ఐసీసీని కోరాడు.

  • Loading...

More Telugu News