Kesineni Nani: ఆ పని చేసుంటే కేశినేని ట్రావెల్స్ మూతపడేది కాదు: నాని సంచలన ట్వీట్
- నంబర్ ప్లేట్లు మార్చి వ్యాపారం చేయలేదు
- అలా చేసుంటే ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదు
- ట్విట్టర్ లో విజయవాడ ఎంపీ కేశినేని నాని
తాను బస్ నంబర్ ప్లేట్లు మార్చి వ్యాపారం చేసుండినా, ఫైనాన్స్ చేసిన వారికి డబ్బులు ఎగ్గొట్టి వుండినా, కేశినేని ట్రావెల్స్ మూతపడే పరిస్థితి వచ్చేది కాదని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ ట్వీట్ పెట్టారు. ''ప్రబుద్ధుడు చెప్పింది అక్షర సత్యం. నంబర్ ప్లేట్లు మార్చి వ్యాపారం చేసినా, ఫైనాన్షియర్లకి డబ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా, 88 ఏళ్ల కేశినేని ట్రావెల్స్ మూసుకునే పరిస్థితి , ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదు. దొంగకి వూరందరూ దొంగలులానే కనపడతారు" అని అన్నారు.