Ghost: హాస్టల్ లో దెయ్యం ఉందని ప్రచారం... రంగంలోకి దిగిన జన విజ్ఞాన వేదిక!

  • కర్ణాటక సీ బెళగళ్ లో ఘటన
  • దెయ్యం ఉందని భయపడుతున్న అమ్మాయిలు
  • లేదంటూ రుజువు చేసిన జన విజ్ఞాన వేదిక

తాముంటున్న హాస్టల్ లో దెయ్యం ఉందని, తాముండలేమని కర్ణాటక, సీ బెళగళ్ మోడల్ గర్ల్ స్కూల్ బాలికలు నిత్యమూ వాపోతున్న వేళ, వారిలో భయాన్ని తొలగించేందుకు జన విజ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. దెయ్యం అన్న మాట భూటకమని చెబుతూ,  "దెయ్యాన్ని పట్టుకుందాం. వస్తారా?" అంటూ హాస్టల్ కు వచ్చి, విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. రాత్రి అక్కడే బస చేసి, వారు చూసిన పలు ఘటనలకు కారణాలు చెబుతూ, వాటికి శాస్త్రీయ నిరూపణ కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి వారితో మాట్లాడుతూ, దెయ్యం కల్పితమని, ఎవరైనా పట్టిస్తే లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తామని అన్నారు. రాత్రిపూట విద్యార్థినులతో కలిసి హాస్టల్ చుట్టూ తిరిగారు. అక్కడే అమ్మాయిలతో కలిసి నిద్రించి, వారిలోని భయాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు.

Ghost
Hostel
Girls
Janavignana Vedika
  • Loading...

More Telugu News