Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సాయిపల్లవి తిరస్కరించిన సినిమా!
  • 'భారతీయుడు' సీక్వెల్ లో సిద్ధార్థ్ 
  • డిమాండ్ చేస్తున్న ప్రముఖ నటి! 

*  విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' చిత్రంలో మొదట కథానాయికగా సాయిపల్లవిని సంప్రదించారట. ఆమెకు కథ నచ్చినప్పటికీ హీరోతో ముద్దు సన్నివేశాలు ఉండడంతో ఆఫర్ ని తిరస్కరించిందని, దాంతో ఆ అవకాశం రష్మికకు వెళ్లిందని ప్రచారం జరుగుతోంది.
*  కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందే 'భారతీయుడు 2' చిత్రం తదుపరి షెడ్యూలు వచ్చే నెల నుంచి జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి తాజా విశేషం ఏమిటంటే, హీరో సిద్ధార్థ్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తాడట.
*  నిన్నటితరం కథానాయిక టబు ప్రస్తుతం బన్నీ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇందుకుగాను ఆమెకు భారీ పారితోషికాన్ని ఇస్తున్నారట. మరోపక్క, తెలుగు నిర్మాతల నుంచి మరిన్ని ఆఫర్లు వస్తుండడంతో టబు భారీ మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందని అంటున్నారు. దాంతో కొందరు నిర్మాతలు వెనక్కువెళ్లిపోతున్నారట.

Sai Pallavi
Vijay Devarakonda
Kamalahasan
Shankar
  • Loading...

More Telugu News