kulbhushan jadhav: కుల్‌భూషణ్ జాదవ్ కేసు: నేడు తీర్పు వెల్లడించనున్న అంతర్జాతీయ న్యాయస్థానం
- కుల్‌భూషణ్‌పై గూఢచర్యం ఆరోపణలు
- 2016లో జాదవ్‌ను అదుపులోకి తీసుకున్న పాక్
- 2017లో మరణశిక్ష విధించిన పాక్ మిలటరీ కోర్టు
నేటి మధ్యాహ్నం మూడు గంటలకు కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. భారత నేవీ మాజీ అధికారి అయిన కుల్‌భూషణ్‌ను 3 మార్చి 2016లో పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు మోపింది. విచారణ అనంతరం 11 ఏప్రిల్ 2017లో పాకిస్థాన్ మిలటరీ కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. దీంతో భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్-పాకిస్థాన్ సమక్షంలో అంతర్జాతీయ న్యాయస్థానం నాలుగు రోజుల విచారణ జరిపింది. అనంతరం కేసు తీర్పును నేటికి వాయిదా వేసింది. నేడు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో పాకిస్థాన్ న్యాయ బృందం ఒక రోజు ముందే ది హేగ్ చేరుకుంది.