Chandrababu: చంద్రబాబుకు కేశినేని, బుద్ధా వెంకన్న మంచి స్నేహితులు: వర్ల రామయ్య

  •  చంద్రబాబును కలవమని వీరికి సూచించా
  • ఇలా పరస్పర విమర్శలు చేసుకోవద్దని చెప్పా
  • పార్టీ కేడర్ కూడా దెబ్బతినే అవకాశముంది

‘ట్విట్టర్’ వేదికగా టీడీపీ నేతలు కేశినేని నాని, బుద్ధా వెంకన్నల మాటల యుద్ధం శ్రుతి మించిన విషయం తెలిసిందే. పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుని పార్టీకి నష్టం కల్గించొద్దని ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వారికి సూచించారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. కేశినేని నాని, బుద్ధా వెంకన్నలిద్దరూ చంద్రబాబుకు మంచి స్నేహితులని అన్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని, ఈ ఇద్దరు నేతలు చంద్రబాబును కలవాలని సూచిస్తూ వారికి తానూ ట్వీట్ చేశానని చెప్పారు. కేశినేని, బుద్ధా లు పరస్పరం విమర్శించుకుంటూ ఇలా ట్వీట్లు చేసుకోవడం మంచి పద్ధతి కాదని, పార్టీ కేడర్ కూడా దెబ్బతినే అవకాశముందని అన్నారు.

Chandrababu
Telugudesam
Kesineni Nani
buddha
varla
  • Loading...

More Telugu News