Ismart shanker: పూరీ ముఖంలో సూపర్ సక్సెస్ మెరుపు ఇప్పటికే నాకు కనిపించింది: రామ్ గోపాల్ వర్మ

  • ఈ నెల 18న విడుదల కానున్న ‘ఇస్మార్ట్ శంకర్’
  • దర్శకుడు పూరీని ఉత్సాహ పరుస్తూ ట్వీట్
  • ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతమన్న వర్మ

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ ను ఉత్సాహపరుస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఈ చిత్రం సూపర్ సక్సెస్ మెరుపు పూరీ జగన్నాథ్ ముఖంలో ఇప్పటికే తనకు కనిపించిందని వర్మ పేర్కొనడం గమనార్హం. ఈ సందర్భంగా నవ్వుతున్న పూరీ జగన్నాథ్ ఫొటోను వర్మ జతపరిచారు. కాగా, ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో హీరోగా రామ్ నటించాడు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ లు నటిస్తున్నారు.

Ismart shanker
director
Puri Jagannadh
Hero
Ram
Nidhi agarwarl
Nabha Natesh
Varma
  • Loading...

More Telugu News