Manchu Manoj: నారాయణఖేడ్ లో మంచు మనోజ్ కు ఓటు.. విచారణకు ఆదేశించిన కలెక్టర్

  • మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితాలో మంచు మనోజ్ పేరు
  • ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
  • అధికారుల తీరుపై అసంతృప్తి

తెలంగాణ రాష్ట్రంలోని నారాయణఖేడ్ పట్టణ ఓటర్ల లిస్టులో టాలీవుడ్ యువనటుడు మంచు మనోజ్ పేరు ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో మంచు మనోజ్ పేరిట ఓటు హక్కు ఉండడంపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేయగా, జిల్లా కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు.

ఈ ఓటరు జాబితాలో మంచు మనోజ్ కు సంబంధించిన అన్ని వివరాలు పేర్కొన్నారు. మంచు మనోజ్ ఫొటోతో పాటు, తండ్రి పేరు మంచు మోహన్ బాబు అని, రెండో వార్డులో 2-25 ఇంటి నెంబర్ అని పేర్కొన్నారు. ఎక్కడో హైదరాబాద్ లో ఉండే మంచు మనోజ్ కు నారాయణఖేడ్ లో ఓటు ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులను సరిగా పరిశీలించకుండానే ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Manchu Manoj
Telangana
Vote
  • Loading...

More Telugu News