Nimmala Ramanaidu: వైసీపీ వల్లే సదావర్తి భూములు ఏపీకి కాకుండా పోయాయి: ఎమ్మెల్యే రామానాయుడు

  • భూముల విలువ రూ.5 వేల కోట్లని వైసీపీ ప్రచారం
  • నిజ నిర్ధారణ కమిటీ రూ.1300 కోట్లుగా తేల్చింది
  • సభలో సైతం అసత్య ఆరోపణలు చేస్తున్నారు

అసెంబ్లీ నాలుగవ రోజు సమావేశాల్లో భాగంగా సదావర్తి భూములపై వాడీవేడి చర్చ జరిగింది. ఇదే అంశంపై అసెంబ్లీ ఆవరణలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, సదావర్తి భూములు వైసీపీ వైఖరి కారణంగా ఏపీకి చెందకుండా పోయాయని ఆరోపించారు.

ఈ భూములపై కోర్టుకు వెళ్లడంతో అవి ఏపీకి చెందినవా? లేదంటే తమిళనాడుకి చెందినవో తేల్చాలని చెప్పిందన్నారు. సదావర్తి భూముల విలువ రూ. 5 వేల కోట్లని వైసీపీ ప్రచారం చేసిందని, కానీ నిజ నిర్ధారణ కమిటీ మాత్రం వాటి విలును రూ.1300 కోట్లు అని తేల్చిందని పేర్కొన్నారు. ఈ భూములపై ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా సభలో సైతం అసత్య ఆరోపణలు చేస్తున్నారని రామానాయుడు ఆరోపించారు.

Nimmala Ramanaidu
Assembly
YSRCP
Chennai
Andhra Pradesh
  • Loading...

More Telugu News