Sensex: 11 శాతం పైగా దూసుకుపోయిన యస్ బ్యాంక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 234 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 74 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో స్టాకులు ర్యాలీని ముందుండి నడిపించాయి. రేపు తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో, యస్ బ్యాంక్ షేర్ భారీగా పెరిగింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 234 పాయింట్లు లాభపడి 39,131కి ఎగబాకింది. నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 11,662కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (11.48%), టాటా మోటార్స్ (5.53%), సన్ ఫార్మా (2.57%), ఎన్టీపీసీ (2.46%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.93%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.86%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.35%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.71%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-0.35%), టెక్ మహీంద్రా (-0.22%).

  • Loading...

More Telugu News