Achennaidu: మీరు రాసివ్వండి, దాన్నే చదువుతానన్న అచ్చెన్నాయుడు.. స్పీకర్ ఆగ్రహం
- గందరగోళం మధ్య కొనసాగుతున్న శాసనసభ సమావేశాలు
- అచ్చెన్న వ్యాఖ్యలను తప్పుబట్టిన స్పీకర్
- ఇదేమైనా బజారు అనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం
ఏపీ శాసనసభ సమావేశాలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ఈరోజు సభ ప్రారంభంకాగానే టీడీపీ తరపున మాట్లాడే అవకాశం అచ్చెన్నాయుడికి ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా... త్వరగా ముగించాలంటూ స్పీకర్ సూచించారు. తాను సబ్జెక్ట్ కే వస్తున్నానని... లేకపోతే మీరే రాసివ్వండి, దాన్నే చదువుతానంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు రాసివ్వండి. నేను చదువుతాను. ఏం వ్యాఖ్యలు ఇవి' అని ప్రశ్నించారు. ఇదేమైనా బజారు అనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వ్యవహరిస్తే సభను నిర్వహించడం చాలా కష్టమవుతుందని అన్నారు.