TRS: నాడు టీఆర్ఎస్, నేడు బీజేపీ... కాలం మారుతూనే ఉంటుంది: విజయశాంతి

  • దత్తాత్రేయ విమర్శలపై స్పందన
  • గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుంజుకున్నారు
  • ఇప్పుడు అడగలేని స్థితిలో టీఆర్ఎస్

గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని, ఇప్పుడు కాలం మారిపోగా, టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీవైపు చూస్తున్నారని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టిన ఆమె, "దత్తాత్రేయ గారు, బీజేపీ... ఒక టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, బీజేపీలో చేరవచ్చన్న అభిప్రాయ ప్రకటనపై స్పందిస్తూ... సీఎం కెసిఆర్ గారు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బలహీన పరిచే ప్రయత్నంలో, ఎంఎల్ఎ లను గుంజుకొని విలీనం కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు అదే విలీన ప్రక్రియ పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపిలు మరో పార్టీ వైపు కొనసాగిస్తే, అడిగే నైతిక హక్కు లేని స్థితి టిఆర్ఎస్ స్వయంగా సృష్టించుకుంది. కాలం ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది" అని ఓ పోస్ట్ పెట్టారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News