Lord Saibaba: సాయి నామస్మరణతో మార్మోగుతున్న బాబా ఆలయాలు

  • నేడు గురు పౌర్ణమి
  • దేదీప్యమానంగా సాయి ఆలయాలు
  • బాబా దర్శనం కోసం పోటెత్తుతున్న భక్తులు

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయాలన్నీ సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. గురుపూర్ణిమను పురస్కరించుకుని ఆలయాలను సర్వాంగసుందరంగా అలంకరించారు. మహారాష్ట్రలోని షిరిడీసాయిబాబాను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివచ్చారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కూడా భక్తులతో రద్దీగా మారాయి.  

Lord Saibaba
temple
Shirdi
gurupurnima
devotees
  • Loading...

More Telugu News