BJP: బీజేపీలోకి వైసీపీ నేత తోట వాణి?

  • పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన వాణి
  • సుజనా చౌదరి ద్వారా బీజేపీలో చేరే యత్నం
  • ఆమె పార్టీ మారితే వైసీపీకి నష్టమే 

విపక్ష నేతలు మరో పార్టీ వైపు చూడటం పరిపాటి.. కానీ ఏపీలో అధికార పార్టీ నేతలు కూడా పక్క చూపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నేత ఒకరు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తోట వాణి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ సుజనా చౌదరి ద్వారా బీజేపీలో చేరేందుకు ఆమె మార్గాన్ని సుగమం చేసుకుంటున్నట్టు సమాచారం. ఏపీలో తోట వాణి బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఒకవేళ ఆమె పార్టీ మారితే ఆ నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద దెబ్బే తగిలే అవకాశం ఉంది.

BJP
Thota Vani
Peddapuram
Sujana Chowdary
YSRCP
  • Loading...

More Telugu News