R.Krishnaiah: జగన్‌తో భేటీ అయిన బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య

  • అరగంట పాటు జగన్‌తో భేటీ
  • రిజర్వేషన్ల అంశంపై జగన్‌తో చర్చ
  • బీసీ సామాజిక వర్గాల సమస్యలపై చర్చ

చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 14 అంశాలతో కూడిన లేఖను ఏపీ సీఎం జగన్‌కు గతంలో రాసిన బీసీ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, నేడు ఇదే అంశంపై జగన్‌తో భేటీ అయ్యారు. నేడు తాడేపల్లికి వెళ్లిన ఆయన సుమారు అరగంటకు పైగా జగన్‌తో భేటీ అయ్యారు. భేటీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరిగింది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల సమస్యలపై జగన్‌తో కృష్ణయ్య చర్చించారని తెలుస్తోంది.

R.Krishnaiah
Jagan
Thadepalli
BC Problems
Reservations
  • Loading...

More Telugu News