special flights: ప్రమాణ స్వీకారం చేయకుండానే మీరు ప్రత్యేక విమానాల్లో తిరగలేదా?: జగన్‌కు యనమల కౌంటర్‌

  • సీఎంలు ప్రత్యేక విమానాల్లో తిరగడం సహజం
  • ప్రభుత్వ ఖర్చులన్నీ దుబారాగా చూడడం సరికాదు
  • తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాల తరలింపు ప్రమాదకరం

ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాల్లో తిరగడం సహజంగా జరిగే పరిణామమని, దాన్ని అంత ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం లేదని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేసే ఖర్చులన్నింటినీ దుబారాగా భావించడం సరికాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక విమానాల్లో తిరిగితే, జగన్‌ పదవీ ప్రమాణ స్వీకారం చేయకుండానే ప్రత్యేక విమానాల్లో తిరిగారని, దీన్ని ఎలా చూడాలని ఆయన ప్రశ్నించారు. బాబు విదేశీ పర్యటన వల్లే ఐదేళ్లలో 5 లక్ష ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు.

గోదావరి జలాల తరలింపుపై యనమల మాట్లాడుతూ ప్రభుత్వం ఓ ప్రమాదకరమైన పథకంలో భాగస్వామి అవుతోందని హెచ్చరించారు. తెలంగాణ భూభూగం నుంచి గోదావరి జలాల తరలింపును అంత తేలికగా చూడడం సరికాదని, ఇది చాలా ప్రమాదకరమైన ప్రయత్నమని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం దయపై మనకు నీటి విడుదల ఉంటుందని గుర్తు చేశారు.

special flights
yanamala
Chandrababu
jagan
  • Loading...

More Telugu News