Ram Madhav: తానా సభలలో మాత్రమే టీడీపీ మిగులుతుంది: రామ్ మాధవ్

  • టీడీపీ అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారు
  • రానున్న రోజుల్లో టీడీపీ భూస్థాపితమవుతుంది
  • 2024 నాటికి అధికారాన్ని చేపట్టే దిశగా బీజేపీ ఎదగాలి

ఐదేళ్ల టీడీపీ అవినీతి పాలనతో ఏపీ ప్రజలు విసిగిపోయారని... అందుకే అధికారం నుంచి సాగనంపారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. భారీ అవినీతికి పాల్పడిన టీడీపీ రానున్న రోజుల్లో భూస్థాపితం కావడం ఖాయమని చెప్పారు. కేవలం తానా సభలలో మాత్రమే ఆ పార్టీ మిగులుతుందని ఎద్దేవా చేశారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడే ప్రయత్నాన్ని ఏపీ ప్రజలు చేశారని... ఇందులో భాగంగానే వైసీపీకి ఓటు వేసి గెలిపించారని చెప్పారు.

2024 నాటికి అధికారాన్ని చేపట్టే దిశగా ఏపీలో బీజేపీ ఎదగాలని పార్టీ శ్రేణులకు రామ్ మాధవ్ సూచించారు. ప్రతి కార్యకర్త దీన్ని సవాలుగా తీసుకుని పని చేయాలని చెప్పారు. కాంగ్రెస్ లేని భారత్ కోసం బీజేపీ ఏమీ చేయాల్సిన అవసరం లేదని... ఆ పనిని రాహుల్ గాంధీనే చూసుకుంటారని ఎద్దేవా చేశారు.

Ram Madhav
BJP
YSRCP
Telugudesam
Rahul Gandhi
  • Loading...

More Telugu News