Crime News: కుళాయి వద్ద ఘర్షణ...బిందెలతో మోదడంతో మహిళ మృతి

  • శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఘటన
  • క్యూలో నిల్చున్నప్పుడు వాగ్వాదం
  • అది ఘర్షణగా మారడంతో విషాదం

క్షణికావేశం నిండుప్రాణాన్ని బలిగొంది. నీళ్లు పట్టుకునేందుకు కుళాయి వద్ద క్యూల్లో నిల్చున్న మహిళల మధ్య ప్రారంభమైన వాగ్వాదం ఘర్షణగా మారి ఓ మహిళ చనిపోయేందుకు కారణమైంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట పల్లె వీధిలో జరిగిన ఈ విషాద  ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. పల్లె వీధికి చెందిన తాటిపూడి పద్మ (38) మంచినీటి కోసం క్యూలో నిల్చుంది.

అదే సమయంలో మరికొందరు మహిళలు నిల్చున్నారు. అయితే, కొందరు వెనుకున్న వారు ముందుకు వచ్చేస్తున్నారన్న అంశంపై తొలుత మహిళల మధ్య మాట యుద్ధం మొదలయ్యింది. కాపేపటికి ఘర్షణగా మారింది. దీంతో మహిళలు రెండు వర్గాలుగా విడిపోయి సరస్పరం బిందెలతో ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. ఈ సందర్భంగా పద్మ గుండె, తలపై బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Crime News
Srikakulam District
sompeta
lady died in raid
  • Loading...

More Telugu News