Kia Plant: కియా ప్లాంట్ చంద్రబాబు వల్ల రాలేదు.. వైయస్సార్ వల్లే వచ్చింది: బుగ్గన

  • చంద్రబాబు పర్యటనల వల్ల ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు
  • చంద్రబాబు మాదిరి ఏ సీఎం కూడా విదేశీ పర్యటనలు చేయలేదు
  • వైయస్ విన్నపం వల్లే కియా ప్లాంట్ వచ్చింది

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు మాదిరిగా విదేశీ పర్యటనలు చేయలేదని అన్నారు. చంద్రబాబు పర్యటనల వల్ల ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని చెప్పారు. కియా ప్రాజెక్టు కూడా చంద్రబాబు వల్ల రాలేదని... వైయస్ రాజశేఖర్ రెడ్డి విన్నపం వల్లే అనంతపురం జిల్లాలో కియా ప్లాంటును నెలకొల్పారని తెలిపారు. కియా సీఈవో జగన్ కు లేశారని... రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలని 2007లో వైయస్ రాజశేఖరరెడ్డి తమను కోరినట్టు లేఖలో పేర్కొన్నారని చెప్పారు. దేశంలో ప్లాంట్ పెడితే ఏపీలోనే పెడతామని ఆనాడే వైయస్ కు చెప్పినట్టు లేఖలో తెలిపారని అన్నారు.

Kia Plant
Buggana
YS Rajasekhara Reddy
YSRCP
Jagan
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News