Kesineni Nani: కేశినేని నాని, బుద్ధా వెంకన్నలకు హైకమాండ్ నుంచి ఫోన్లు

  • నాని, వెంకన్నల మధ్య ట్వీట్ల యుద్ధం
  • పరిస్థితిని చక్కదిద్దే పనిలో హైకమాండ్
  • త్వరలో చంద్రబాబును కలవనున్న ఇరువురు నేతలు

టీడీపీ ఎంపీ కేశినాని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వైఖరితో పార్టీకి సరికొత్త తలనొప్పి ప్రారంభమైంది. పార్టీ శ్రేణులు కూడా వీరి వైఖరితో ఆవేదన చెందుతున్నారు. దీంతో, పార్టీ హైకమాండ్ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. హైకమాండ్ నుంచి ఇద్దరికీ ఫోన్లు వెళ్లాయి. సంయమనం పాటించాల్సిందిగా ఇరువురికీ హైకమాండ్ సూచించింది. మరోవైపు, ఇద్దరు నేతలు త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబును కలవనున్నారు.

Kesineni Nani
Budda Venkanna
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News