Kesineni Nani: చంద్రబాబుగారు... నేను కావాలంటే మీ పెంపుడు కుక్కలను అదుపులో పెట్టుకోండి: కేశినేని నాని వార్నింగ్

  • నేను వద్దనుకుంటే రాజీనామా చేస్తా
  • పార్టీలు మారే సంస్కృతి నాది కాదు
  • ట్విట్టర్ లో కేశినేని నాని

నిన్నటి వరకూ ఎవరి పేరునూ చెప్పకుండా, తన సోషల్ మీడియా ఖాతాల్లో విమర్శలు, కామెంట్లూ చేస్తూ వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు నేరుగా చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. "చంద్రబాబు గారూ... మీ పార్టీలో నాలాంటి వారు వద్దనుకుంటే నేరుగా నాకు చెప్పండి. వెంటనే నా ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేస్తాను. నావంటి వారు కావాలని అనుకుంటే, మీ పెంపుడు కుక్కలను కంట్రోల్ లో పెట్టుకోండి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు ఆయన, "రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు, గుళ్లో కొబ్బరి చిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవీదారులకి అవసరం. నాకు అవసరం లేదు" అని కూడా ట్వీట్ చేశారు. ఇప్పటికే విజయవాడ నేతల మధ్య ట్వీట్ల వార్ తారస్థాయికి చేరింది. ఇదే విషయంలో నిన్న నేతల మధ్య వాడివేడి విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనను విమర్శించే వారిని చంద్రబాబు నియంత్రణలో ఉంచడం లేదని కేశినేని నాని తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.

Kesineni Nani
Chandrababu
Twitter
Resign
  • Error fetching data: Network response was not ok

More Telugu News