Apoorva Shukla: జైల్లో జ్యోతిష్యం నేర్చుకుంటున్న ఎన్డీ తివారీ కోడలు!

  • భర్త హత్య కేసులో జైల్లో ఉన్న అపూర్వ శుక్లా
  • చిలకజోస్యం కార్డులు చదవడంపై శిక్షణ
  • ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం లేదన్న జైలు వర్గాలు

దివంగత రాజకీయవేత్త, మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ కొన్నాళ్ల కిందట అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంగతి తెలిసిందే. రోహిత్ శేఖర్ మృతికి ఆయన భార్య అపూర్వ శుక్లానే అన్న ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం అపూర్వ రిమాండ్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్నారు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అపూర్వ జైల్లో ఇతర ఖైదీల్లా కాకుండా ప్రత్యేకంగా జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు. భవిష్యత్తును చెప్పే టారో కార్డులు చదవడంపై ఆమె శిక్షణ పొందుతున్నారు. ఇది ఒక రకంగా చిలక జోస్యం వంటిదే. వారంలో రెండు రోజుల పాటు జైల్లో దీనిపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. డాక్టర్ ప్రతిభా సింగ్ టారో కార్డులు చదవడంపై శిక్షణ ఇస్తున్నారు. ఓ హత్యకేసులో ముద్దాయికి ఉండాల్సిన ఆందోళన అపూర్వలో ఏమాత్రం కనబడలేదని డాక్టర్ ప్రతిభా సిన్హా తెలిపారు. జైలు అధికారులు కూడా ఇదే విషయం చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News