bjp: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా: బీజేపీ నేత సుజనా చౌదరి

  • రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో పర్యటిస్తా
  • అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరాలన్నదే లక్ష్యం
  • రాష్ట్రంలో కొత్త రాజకీయాలు చూస్తారు

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని, ఏపీ వ్యాప్తంగా త్వరలో పర్యటిస్తానని బీజేపీ నేత సుజనా చౌదరి వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరాలన్న లక్ష్యంతో ఉన్నామని, అందుకు తగిన ప్రణాళికలతో ముందుకెళతామని చెప్పారు. అందులో భాగంగానే ఏపీలోనూ అడుగులు వేస్తున్నామని, పార్టీని బలోపేతం చేయాలని అధిష్ఠానం ఆదేశించిందని అన్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయాలు చూస్తారని వ్యాఖ్యానించారు. కేంద్రంతో పోరాడితే అభివృద్ధి విషయంలో రాష్ట్రం వెనుకబడుతుందని, బీజేపీతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. కావాలని ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో కేంద్రం పని చేయదని స్పష్టం చేశారు. 

bjp
Sujana Chowdary
Andhra Pradesh
politics
  • Loading...

More Telugu News