Vijayawada: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం

  • నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు
  • రాష్ట్రంపై  అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలి
  • దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్  

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన కనక దుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు. ఆలయాన్ని వివిధ రకాల పళ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అందంగా అలంకరించారు. శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తన కుటుంబ సభ్యులతో క‌లిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. వెల్లంపల్లి తన కుటుంబసభ్యులతో అమ్మ వారి దర్శనం చేసుకున్నారు.

అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా ఆషాఢమాసంలో ఇంద్రకీలాద్రి పై మూడు రోజులపాటు  శాకాంబరీ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా పేర్కొన్నారు.

Vijayawada
kanaka durga
minister
vellampalli
  • Loading...

More Telugu News