Andhra Pradesh: అలాంటి వన్నీ కాల్ మనీ గాళ్ళకి, సెక్స్ రాకెట్ గాళ్ళకే అవసరం: బుద్ధా వెంకన్న ట్వీట్ కు కేశినేని ఘాటు సమాధానం

  • రాజకీయ జన్మలు, పునర్జన్మలు నాకు అవసరం లేదు
  • అవి కొబ్బరి చిప్పల దొంగలకే అవసరం 
  • సెక్స్ రాకెట్ గాళ్ళకి, బ్రోకర్లకి, పైరవిదారులకే అవసరం

టీడీపీ నేతలు కేశినేని నాని, బుద్ధా వెంకన్నల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. వాళ్లిద్దరూ పరస్పరం విమర్శించుకుంటూ చేస్తున్న ట్వీట్లే ఇందుకు నిదర్శనం. ‘చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని చిరంజీవి పార్టీని కూల్చావు.. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడులా మాట్లాడుతున్నావు’ అంటూ కేశినేనిని విమర్శిస్తూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై కేశినేని నాని స్పందించారు. రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు తనకు అవసరం లేదని అన్నారు. ఇలాంటి వన్నీ గుళ్ళో కొబ్బరి చిప్పల దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్ళకి, సెక్స్ రాకెట్ గాళ్ళకి, బ్రోకర్లకి, పైరవిదారులకే అవసరమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh
Telugudesam
Kesineni Nani
mp
budha
  • Loading...

More Telugu News