Andhra Pradesh: సభలో బలం చూసుకుని రౌడీ యిజానికి పాల్పడటం దురదృష్టకరం : జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

  • అడిగిన ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పలేకపోతున్నారు
  • అందుకే, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు
  • ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జగన్ ను నిలదీస్తాం

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా సమస్యలను పక్కదారి పట్టించడమే అవుతుందని అన్నారు. జగన్ నాడు తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు గడించారని ఆరోపించారు. ఇప్పుడేమో ప్రజలకు మాయమాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జగన్ ను నిలదీస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత అవసరాల కోసం కొందరు టీడీపీని వీడుతున్నారని, సభలో బలం చూసుకుని రౌడీ యిజానికి పాల్పడటం దురదృష్టకరమని వైసీపీపై అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. 

Andhra Pradesh
YSRCP
cm
jagan
atchanaidu
  • Loading...

More Telugu News