Madhya Pradesh: భార్య పోలీసు యూనిఫాంను గాళ్ ఫ్రెండ్ కు తొడిగి అరాచకం!
- మధ్యప్రదేశ్ లో ఘటన
- భార్య పోలీస్ శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్
- సులువుగా డబ్బు సంపాదించేందుకు గర్ల్ ఫ్రెండ్ తో కలిసి అవినీతి
మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి తెరలేపాడు. ఇందులో గర్ల్ ఫ్రెండ్ కు కూడా భాగస్వామ్యం కల్పించడమే అసలు విశేషం. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ వ్యక్తి భార్య పోలీస్ శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తోంది. అయితే, భార్య పోలీసు కావడంతో ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరింత డబ్బు సంపాదించేందుకు ఆ వ్యక్తి కొత్త ఎత్తుగడ వేశాడు. భార్య యూనిఫాంను తన గర్ల్ ఫ్రెండ్ కు తొడిగి ఆమెతో పోలీసు అధికారి వేషం వేయించాడు.
ఆమెను నిజమైన పోలీసు అధికారిగా చూపిస్తూ ప్రజలను బెదిరించి డబ్బు గుంజడం మొదలుపెట్టాడు. అయితే ఆ నకిలీ పోలీసు అధికారిణి తీరుపై అనుమానంతో ప్రజలు ఫిర్యాదుచేయడంతో అసలు భాగోతం బట్టబయలైంది. మహిళా ఎస్సై భర్తను, అతని గర్ల్ ఫ్రెండ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచి ఓ నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.