icc world cup: ఇంగ్లాండ్ ప్రపంచకప్ ఫైనల్ ను స్కాట్ ల్యాండ్, ఫ్రాన్స్, వేల్స్ తో ఆడబోతోందట.. బ్రిటీషర్ల వింత జవాబులు!

  • ఇంగ్లాండ్ లో ‘ఈఎస్ పీఎన్’ సంస్థ సర్వే
  • ఫైనలిస్టుల పేర్లను అడిగిన యాంకర్
  • చిత్రవిచిత్రమైన జవాబులు చెప్పిన బ్రిటీషర్లు

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్  లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. ఈసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్ ను ఎవరు దక్కించుకున్నా అది చరిత్రే అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకూ ఈ రెండు జట్లు ఒక్క వన్డే ప్రపంచకప్ ను కూడా గెలుచుకోలేదు. తాజాగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ మీడియా సంస్థ ‘ఈఎస్ పీఎన్’ బ్రిటన్ లో ఓ సర్వే చేపట్టింది. ప్రపంచకప్ ఫైనల్ లో ఏయే జట్లు తలపడబోతున్నాయని ప్రశ్నించింది.

దీనికి ప్రజలు ఇచ్చిన సమాధానం విన్న యాంకర్ కు దిమ్మతిరిగింది. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో, భారత్ తో ఫైనల్ ఆడబోతోందని కొందరు చెప్పారు. మరికొందరు బ్రిటీషర్లు అయితే ఇంగ్లాండ్, వేల్స్ మధ్య ఇంగ్లాండ్-స్కాట్ ల్యాండ్ మధ్య మ్యాచ్ జరగబోతోందని సెలవిచ్చారు. అక్కడితో ఆగకుండా ఫ్రాన్స్ ను కూడా ఈ జాబితాలో చేర్చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కడంటే ఒక్కరే ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య మ్యాచ్ జరుగుతుందని చెప్పడం గమనార్హం. ఈ వీడియోను మీరూ చూసేయండి.

icc world cup
one day cricket
england
newzeland
  • Error fetching data: Network response was not ok

More Telugu News