world cup: వరల్డ్ కప్ ఫైనల్ .. ‘లార్డ్స్’లో తలపడనున్న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్లు

  • ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్
  • వరల్డ్ కప్ కోసం హోరాహోరీగా తలపడనున్న జట్లు
  • వర్షంతో ఆటంకం కలిగితే డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఓవర్ల కుదింపు

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కొద్ది సేపట్లో జరగనుంది. లండన్ లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లాండు, న్యూజిలాండ్ జట్లు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు తలపడనున్నాయి. వరల్డ్ కప్ ను ఇంతవరకూ ఈ రెండు జట్లు సాధించలేకపోయాయి. దీంతో, రెండు జట్లు వరల్డ్ కప్ ను కైవసం చేసుకునేందుకు హోరాహోరీగా పోరాడనున్నాయి.

ఇదిలా ఉండగా, ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ కు ఆటంకం కలిగితే డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఓవర్లను కుదింపు చేయనున్నారు. అలా కాకుండా, మ్యాచ్ ను రిజర్వ్ డేకు మారిస్తే తొలిరోజు నిలిచిన చోట నుంచే తిరిగి ప్రారంభిస్తారు. రిజర్వ్ డే న కూడా వర్షం వస్తే ఓవర్లు కుదించి డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ నిర్వహించనున్నారు. ఒకవేళ రిజర్వ్ డే నాడు రోజంతా వర్షం కొనసాగితే కనుక ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారని సమాచారం.

world cup
cricket
Lord`s
England
New zealand
  • Loading...

More Telugu News