Sujana Chowdary: బీజేపీలో ఎవరు చేరుతున్నారో నాకూ తెలియదు : ఎంపీ సుజనా చౌదరి

  • నేను కూడా మీడియా ద్వారానే తెలుసుకుంటున్నాను
  • పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చాను
  • ఆ క్రమంలోనే విజయవాడ వచ్చాను

ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు పలువురు సీనియర్‌ నాయకులు త్వరలోనే తమ పార్టీలో పలువురు సీనియర్లు చేరబోతున్నారని కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటే ఇటీవలే ఆ పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి మాత్రం తనకా విషయం తెలియదంటూ ఆశ్చర్యపరిచారు. కాషాయం కండువా కప్పుకున్న తర్వాత తొలిసారి విజయవాడ వచ్చిన ఆయన ఓ చానల్‌ ప్రతినిధితో మాట్లాడారు. గుంటూరులో జరిగే పార్టీ పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు తాను వచ్చానని, ఆ సందర్భంగా విజయవాడ వచ్చాను తప్ప ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదన్నారు.

ఇక పార్టీలో ఎవరెవరో చేరుతున్నారన్న విషయం మీడియాలో వచ్చిన వార్త వల్లే తనకూ తెలుసునని, వాస్తవంగా ఎవరు చేరుతున్నారన్నది నాకు సమాచారం లేదని స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు.

Sujana Chowdary
BJP
Vijayawada
  • Loading...

More Telugu News