Hyderabad: కూతురుతోపాటు భవనంపై నుంచి దూకి తల్లీ ఆత్మహత్యా యత్నం

  • తల్లి దుర్మరణం...ప్రాణాపాయ స్థితిలో కూతురు
  • హైదరాబాద్‌ కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో విషాదం
  • కుటుంబ తగాదాలే కారణమన్న అనుమానం

కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ తల్లి తన రెండేళ్ల కుమార్తెతో కలిసి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌ నగరం కూకట్‌పల్లి పరిధిలోని బాలాజీనగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రెండేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఓ ఫంక్షన్‌ విషయంలో దంపతుల మధ్య వివాదం నెలకొందని, క్షణికావేశానికి గురైన వివాహిత ఇంతటి ఘోరానికి పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News