Vijay Mallya: దొంగను నేనా? మీ బ్యాంకులా?... తేల్చుకోవాలంటున్న విజయ్ మాల్యా!

  • క్రిస్ గేల్ తో ఫొటో దిగిన మాల్యా
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ట్రోల్స్
  • డబ్బులు కడతానంటున్నా తీసుకోవడం లేదని మాల్యా మండిపాటు

బ్యాంకులకు తన సంస్థలు చెల్లించాల్సిన బకాయిలను అన్నింటినీ కడతానని ఏడాది కాలంగా చెబుతున్నా బ్యాంకులేవీ పట్టించుకోవడం లేదని, ఇక దొంగెవరో తేల్చుకోవాలని యూబీ గ్రూప్ మాజీ అధినేత, ప్రస్తుతం లండన్ లో తలదాచుకున్న విజయ్ మాల్యా ప్రశ్నించారు. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ తో కలసి దిగిన ఫొటోను ఆయన పోస్ట్ చేయగా, పలువురు నెటిజన్లు "దొంగ... దొంగ" అని కామెంట్లు పెట్టారు. దీనిపై స్పందించిన మాల్యా, తన స్నేహితుడు, యూనివర్సల్ బాస్‌ క్రిస్ గేల్‌ ను కలడవం ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. తనను కొందరు అదే పనిగా ట్రోల్ చేస్తున్నారని, తనను దొంగ అంటున్నవారంతా మెదడులేనివారేనని మండిపడ్డారు. ఇచ్చిన డబ్బులు వసూలు చేయమని మీ బ్యాంకులను నిలదీయాలని, తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తానని సంవత్సరం నుంచి చెబుతూనే ఉన్నానని అన్నారు.దొంగ ఎవరో? తేల్చుకోవాలంటూ తన ట్విట్టర్ ఖతాలో వ్యాఖ్యానించారు.

Vijay Mallya
Trool
Banks
Chris Gayle
  • Loading...

More Telugu News