Tollywood: నాకు అనారోగ్యం వచ్చింది.. కానీ ఆయన నన్ను బతికించారు!: నటుడు పోసాని కృష్ణమురళీ

  • చచ్చిపోయేంతగా అనారోగ్యం రాలేదు
  • నిక్షేపంగా ఉన్నా.. సినిమా షూటింగుల్లో పాల్గొంటా
  • మీడియాతో మాట్లాడిన పోసాని

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళీ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు ఆయనకు ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్  అనంతరం పోసాని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో పోసాని స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. తాను నిక్షేపంగా ఉన్నాననీ, త్వరలోనే సినిమా షూటింగులో కూడా పాల్గొనబోతున్నానని పోసాని తెలిపారు.

‘అందరికీ నమస్కారం. కొన్నాళ్లుగా నా ఆరోగ్యం బాగోలేదని, విషమంగా ఉందని సోషల్ మీడియాలో వచ్చినట్లు నా ఫ్రెండ్స్ చెప్పారు. నిజమే.. నాకు అనారోగ్యం వచ్చింది. కానీ చచ్చిపోయేంతగా కాదు. చూస్తున్నారుగా.. మీ ముందే ఉన్నాను. వచ్చింది. యశోదా ఆసుపత్రిలో చేరాను. డా.ఎన్వీరావు గారు నన్ను బతికించారు.

పరిపూర్ణవంతుడైన ఆరోగ్యవంతుడిగా చేశారు. కాబట్టి ఇకపై నా ఆరోగ్యం గురించి మీకు ఎలాంటి ఆందోళన వద్దు. ఇంకో వారం, 10 రోజుల్లో సినిమా షూటింగులకు వెళ్లబోతున్నాను. తెరపై కనిపించబోతున్నాను. ఇన్నాళ్లూ నా ఆరోగ్యం గురించి కంగారు పడ్డవాళ్లకు, నేను బాగుండాలని కోరుకున్నవాళ్లకు శతధా కృతజ్ఞతలు’ అని పోసాని కృష్ణమురళీ చెప్పారు.

Tollywood
Posani Krishna Murali
health
rumour
video
Social Media
calrity
  • Error fetching data: Network response was not ok

More Telugu News