Andhra Pradesh: అందుకే నేను టీడీపీని వదిలేసి బీజేపీలో చేరాను!: రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి

  • విజయవాడలో బీజేపీ ఆత్మీయ సమావేశం
  • మోదీ, షాతో భారత్ ప్రాధాన్యత పెరిగిందన్న సుజనా
  • చంద్రబాబు అధర్మపోరాటాలు చేశారని విమర్శలు

తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఈరోజు ఏపీకి వచ్చారు. విజయవాడలో ఈరోజు బీజేపీ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సుజనా మాట్లాడారు. బీజేపీలో చేరకముందు తాను పరోక్ష రాజకీయాల్లోనే ఉన్నానని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరారని చెప్పారు.

ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సారథ్యంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాధాన్యత పెరిగిందన్నారు. 2014 ఎన్నికల ముందు టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు కుదర్చడంలో తాను కీలక పాత్ర పోషించానని సుజనా చౌదరి తెలిపారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ధర్మపోరాటాల పేరుతో అధర్మ పోరాటాలు చేశారని విమర్శించారు. ఈ విషయంలో తాను గొంతు విప్పి చాలా స్పష్టంగా చెప్పానని అన్నారు. 

Andhra Pradesh
Telugudesam
BJP
Sujana Chowdary
amaravati
  • Loading...

More Telugu News