Sujana Chowdary: కాషాయం కండువా కప్పుకున్నాక తొలిసారి విజయవాడకు ఎంపీ సుజనాచౌదరి

  • ఎయిర్‌పోర్టు వద్ద ఘన స్వాగతానికి ఏర్పాట్లు
  • గన్నవరం నుంచి విజయవాడకు భారీ ర్యాలీకి సన్నాహాలు
  • అనంతరం కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమావేశం

సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించి కాషాయం కండువా కప్పుకున్న రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఈరోజు తొలిసారి విజయవాడ వస్తుండడంతో ఆయన అభిమానులు హడావుడి చేస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి సుజనా విజయవాడ వరకు భారీ ర్యాలీగా రానున్నారని, అనంతరం కార్యకర్తలు, అభిమానులతో జరిగే సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంలో సుజనా ఏం మాట్లాడబోతున్నారు? మరికొందరు బీజేపీలో చేరనున్నారన్న ఆ పార్టీ నేతల మాటలపై ఆయన స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

Sujana Chowdary
BJP
Vijayawada
rally
meeting
  • Loading...

More Telugu News